epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు

అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు
ప్రాణవాయువుకు అడవులే ప్రధాన ఆధారం
మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ

కాకతీయ, ములుగు ప్రతినిధి : అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువుకు అడవులే ప్రధాన మూలాధారమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా నిలిచిందని మంత్రి తెలిపారు. పంటల దిగుబడులు, వర్షపాతం, పర్యావరణ సమతుల్యతకు అడవులు కీలకమని చెప్పారు. అడవులు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కూడా అడవుల ద్వారానే లభిస్తున్నాయని వివరించారు. వేసవి కాలంలో అడవులకు నిప్పు పెట్టడం, చెట్లను నరికి వేయడం, వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం పెంపుతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే అడవుల రక్షణ అత్యవసరమని అన్నారు. డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ అడవుల రక్షణలో అటవీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పసర గ్రామంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.