epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని

అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని..

ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు..

రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరం..

రూ. 200 కోట్ల దోపిడీ ఆరోపణలు.. సీబీఐ, సిఐడి దర్యాప్తు డిమాండ్..

పార్క్ భూమి ఆక్రమణపై అసెంబ్లీలో హాట్ టాపిక్..

తప్పైతే రాజీనామా చేస్తా.. నాయిని సవాల్..

కాకతీయ, వరంగల్ బ్యూరో :తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో భారీ అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు తమను దొంగలుగా ఆరోపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సభలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు సుమారు రూ. 200 కోట్ల అక్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ, సిఐడి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక తన ఆరోపణలు నిరాధారమని తేలితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా తమపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించగలిగితే రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హనుమకొండలోని పార్క్ భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై ప్రతిపక్షాలు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తన రాజీనామా లేఖను గౌరవ స్పీకర్‌కు పంపిస్తున్నానని ప్రకటించిన ఆయన, నిజం బయటపడే వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. సభలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. నాయిని వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ముదురుతున్నాయి. ఈ అంశంపై త్వరలోనే మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం పై ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. నిజానిజాలు వెలికితీసే దిశగా దర్యాప్తు సంస్థలు ఎలా ముందుకు సాగుతాయన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.