epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
: మంత్రి సీతక్క
మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

కాకతీయ, ములుగు ప్రతినిధి: మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో కలిసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామైక్య సంఘ భవనానికి 10 లక్షలు, సీఆర్‌ఆర్ నిధులతో 72.50 లక్షలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షలతో నిర్మించిన శ్రీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

మండల అభివృద్ధికి ప్రణాళికలు

మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. మండల సముదాయ భవనాలు నిర్మిస్తూ ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోని అంగడి స్థలాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘ సభ్యులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. అక్షరమాల కార్యక్రమం ద్వారా మహిళలు చదువుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 18 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. సీఆర్‌ఆర్, ఎంఆర్ నిధులతో రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సునీత, మండల ప్రత్యేక అధికారి కృపాకర్, సర్పంచ్ శ్యామ్ రావు, ఎంపీఓ, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.