ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆరు గ్యారెంటీలను క్రమబద్ధంగా అమలు చేస్తున్నాం
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి
వడ్డే కొత్తపల్లిలో బీఆర్ఎస్కు షాక్
200 మంది నాయకులు కాంగ్రెస్లో చేరిక
కాకతీయ, పెద్దవంగర : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీలను క్రమబద్ధంగా అమలు చేస్తున్నామని టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన సుమారు 200 మంది నాయకులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆమె ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలపై దృష్టి
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను ఓర్వలేని ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బూటకపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ వేణుగోపాల్ రావు, బొల్లు ఊసయ్య, కేసబోయిన సుభాష్ చంద్ర రాజు, దంతపల్లి సతీష్, సోమరపు పరుశురాములు, దండుగుల సంధ్య శ్రీకాంత్, మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, నాయకులు రంగు మురళి గౌడ్, రవీందర్ రెడ్డి, సైదులు, సతీష్, వేణు, గోపాల్ నాయక్, రవి, ఉపేందర్, మోహన్ రావు, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

