epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
రైతుకు అండగా రేవంత్‌ ప్రభుత్వం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే భూక్య ముర‌ళీనాయ‌క్‌
నెల్లికుదురు మండ‌లంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
రోడ్డు కోసం ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్
రహదారికి కొత్త తారు రోడ్డును మంజూరు చేయిస్తామని హామీ

కాకతీయ, నెల్లికుదురు : ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతు సంక్షేమానికి ఎప్పటికీ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మండలంలోని ఆలేరు గ్రామంలో మొక్కజొన్న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని, శ్రీరామగిరి, కాచికల్ ఎక్స్ రోడ్, ఎర్రబెల్లి గూడెం, మేచరాజుపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పంటకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని కోరారు.

రోడ్డు కోసం వేడుకున్న ఫీల్డ్ అసిస్టెంట్

కార్యక్రమం అనంతరం కాచికల్లు నుంచి మేచరాజుపల్లి మీదుగా బూరుగుమడ్ల, పర్వతగిరి, వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని తెలియజేస్తూ ఎర్రబెల్లి గూడెం ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుని వేడుకోవడం అక్కడి వారిని కలచివేసింది. రామానుజాపురం, ఎర్రబెల్లి గూడెం, మేచరాజుపల్లి గ్రామాల ప్రజలు కూడా రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, పాడైపోయిన రహదారికి కొత్త తారు రోడ్డును మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో రోడ్డు మంజూరుపై ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొంటూ, తాము త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచులు గుండెబోయిన ఉష అశోక్, సుజాత వాసు, ధనమ్మ అమృ, ఉపసర్పంచి సాంబమూర్తి, నాయని పద్మ సత్యపాల్ రెడ్డి, మాదరి ప్రశాంత్, పులి వెంకన్న, శ్రీరామగిరి, నెల్లికుదురు, ఎర్రబెల్లి గూడెం పి ఎస్ సి ఎస్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.