సర్పంచ్ చొరవతో రేషన్ దుకాణం ప్రారంభం
కాకతీయ, గీసుగొండ: సర్పంచ్ చొరవతో గ్రామస్తులు ఏండ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ దుకాణం ప్రారంభమైంది.మండలంలోని రాంపూర్ 2018లో గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటికీ,రేషన్ సరుకుల కోసం గ్రామస్తులు గీసుగొండకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ రడం భరత్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి,గ్రామంలోనే రేషన్ దుకాణం ఏర్పాటుకు కృషి చేశారు.దీంతో ప్రస్తుతం గ్రామ ప్రజలు తమ సొంత గ్రామంలోనే రేషన్ పొందగలుగుతున్నారు. రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ భరతును గ్రామస్తులు అభినందిస్తున్నారు.

