ప్రజల దాహార్తి తీర్చడమే ప్రధాన లక్ష్యం
: ఎంపీడీవో గుగులోత్ కిషన్
కాకతీయ, రాయపర్తి : ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహం తీర్చడమే ప్రధాన లక్ష్యంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎంపీడీవో గుగులోత్ కిషన్ తెలిపారు. సోమవారం రాయపర్తి ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీడీవో గుగులోత్ కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్పంచులు, పంచాయతీ అధికారులు తమ గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సూచించారు. సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి మాట్లాడుతూ స్థానికులతో పాటు వాహనదారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ రమేష్, పంచాయతీ కార్యదర్శి వల్లె వినోద్ కుమార్, కారోబార్ కారుపోతుల రామచంద్రయ్య, వార్డు సభ్యులు గారె కళ్యాణి విష్ణు, దురిశెట్టి స్వప్న యాకయ్య, కుంట రాంబాబు, కంతుల రవళి జంపి, కంతుల జమున శ్రీనివాస్, కుంట రాజు, పంచాయతీ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

