ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
సొంత నిధులతో ఏర్పాటు చేసిన సర్పంచ్ కవిత
అభినందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, పెద్దవంగర: మండలంలోని రామచంద్రు తండాలో గ్రామస్థుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో సర్పంచ్ పానుగోత్ కవిత ప్రదీప్ తన సొంత నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధతో, తన సొంత ఖర్చుతో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ కవితను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామస్థుల ఇబ్బందులను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం శుభపరిణామన్నారు. తండా ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సుధీర్, సంజయ్ పాల్గొన్నారు. వీరితో పాటు వార్డు సభ్యులు, నాయకులు దశరథ్ నాయక్, వెంకన్న నాయక్, యాకు నాయక్, సోమని నాయక్, గోపాల్ నాయక్, గల్యా నాయక్, శ్రీను నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు.

