కటాక్షపూర్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
కాకతీయ, ఆత్మకూర్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు శిరంశెట్టి సుమన్ పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ త్యాగాల ఫలితమే తెలంగాణ..
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితమని కొనియాడారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు నరేష్, సీనియర్ నాయకులు ఎండి సర్దార్, నాగరాజు, అదిరెడ్డి, రాజన్న, శ్రీనివాస్, సాంబశివరావు, బిక్షపతి, రాజేందర్, తిరుపతి, రమేష్, నాగార్జున, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

