10న గౌతమ్ స్కాలర్షిప్ టెస్ట్
ప్రతిభావంతులకు ఉచిత విద్యా అవకాశాలు
ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ కోర్సులకు ప్రత్యేక స్కాలర్షిప్లు
వెల్లడించిన గౌతమ్ జూనియర్ కళాశాలల యాజమాన్యం
కాకతీయ, హన్మకొండ : 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు గౌతమ్ జూనియర్ కళాశాలలు ప్రత్యేకంగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హాస్టల్‌తో కూడిన ఉచిత విద్య, ప్రత్యేక స్కాలర్షిప్లు అందించనున్నట్లు తెలిపింది. హనుమకొండలోని గౌతమ్ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించనున్నారు. 2026లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని యాజమాన్యం పేర్కొంది. పరీక్షలో ప్రతిభ కనబరిచిన మొదటి 5 మంది విద్యార్థులకు ఐఐటీ, నీట్ జీనియస్ బ్యాచ్‌లో, తదుపరి 5 మందికి ఇంటర్‌తో పాటు ఈఏపీసెట్ ఫోకస్ బ్యాచ్‌లో, మరో 5 మందికి రెగ్యులర్ ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక స్కాలర్షిప్లు కల్పించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.20 లక్షల విలువైన హాస్టల్‌తో కూడిన ఉచిత విద్య అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష
విద్యార్థులు 10వ తరగతి హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. పరీక్షలో గణితం 35 మార్కులు, ఫిజిక్స్ 15 మార్కులు, కెమిస్ట్రీ 15 మార్కులు, బయోలాజికల్ సైన్స్ 35 మార్కులతో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహించబడుతుందని, పరీక్ష సమయం 2 గంటలు ఉంటుందని పేర్కొన్నారు. బాలికల కోసం భీమారం ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని గౌతమ్ జూనియర్ కాలేజీలో, బాలుర కోసం పళివెల్పుల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని గౌతమ్ జూనియర్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9393444808, 9100666804, 7995424666 నంబర్లను సంప్రదించాలని యాజమాన్యం కోరింది.

