కేఎంటీపీలో పరిశ్రమల పనితీరు పరిశీలన
కిటెక్స్,యంగ్ వన్,గణేశ్ ఇండస్ట్రీస్‌లను క్షేత్రస్థాయిలో
పరిశీలించిన కేంద్ర జౌళి పరిశ్రమల శాఖ కార్యదర్శి
కాకతీయ, గీసుగొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమల పనితీరును భారత ప్రభుత్వ జౌళి పరిశ్రమల శాఖ కార్యదర్శి నీలం శమి రావు పరిశీలించారు. మండలంలోని శాయంపేట గ్రామ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో హైటెక్స్,యంగ్ వన్,గణేశ్ ఇండస్ట్రీస్ సంస్థలను సందర్శించి ఉత్పత్తి కార్యకలాపాలు, నిర్వహణ విధానం,కార్మిక సంక్షేమ చర్యలు, పారిశ్రామిక అభివృద్ధి పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంపెనీల నిర్వహణ విధానం, ఉత్పత్తి సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు ప్రశంసలు తెలిపారు.పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నా యని పేర్కొన్నారు.ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు దోహద పడుతున్నా యని అభినందించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ శశాంక్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా,ఆర్డీఓ సుమ,పరిశ్రమల శాఖ జెడ్ఎం స్వామి, గీసుగొండ తహసీల్దార్ రియాజుద్దీన్, సంగెం తహసీల్దార్ జి.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

