ఎమ్మెల్యే తండ్రి ని పరామర్శించిన మండల సర్పంచులు నాయకులు
కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మురళి నాయక్ తండ్రి భూక్య మంగ్య నాయక్ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు మండల నాయకులు మర్యాదపూర్వకంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భూక్య మంగ్య నాయక్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే డా. మురళి నాయక్ తో నెల్లికుదురు మండల రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి సమస్యలు మరియు మండల సమగ్ర అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచే మరింత బలోపేతం కావాలని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రతి గ్రామానికి సమాన ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తాం అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నెల్లికుదురు మండల కాంగ్రెస్ సర్పంచులు పులి వెంకన్న, అశోక్, వీరన్న, భాస్కర్, రామ్ సింగ్, సోమన్న అమృ, ఏకాంతం, ప్రశాంత్, నాగరాజు, రామ్ సింగ్, ఆనంద్, మధు,, వాసు, సోమన్న, శ్రీనివాస్, మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్, ఆకుతోట సతీష్, చీకటి జగదీష్, రాజు యాదవ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

