epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి

బండిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి
బాలిక‌కు న్యాయం చేయాల్సింది పోయి..బెదిరింపులా
పోలీసులు సీసీటీవీ ఫుటేజులు స్వాధీనం చేసుకోవాలి
భ‌గీర‌థ సాయి, బండి సంజ‌య్ ఫోన్ కాల్ డేటాను ప‌రిశీలించాలి
బాధితురాలికి న్యాయం జరిగేంత వ‌ర‌కు కాంగ్రెస్‌ పోరాటం
కేంద్రం ప్ర‌భుత్వం బేటీ బచావో నినాదాలకే పరిమితమా?
కుడా చైర్మ‌న్‌, హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి ధ్వ‌జం

కాకతీయ, వరంగల్ బ్యూరో : కొడుకు చేతిలో మోస‌పోయిన బాలిక‌కు న్యాయం చేయాల్సింది పోయి..బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం దారుణ‌మ‌ని కుడా చైర్మ‌న్‌, హ‌న్మ‌కొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. బాలిక‌ను, బాలిక కుటుంబ స‌భ్యులు బెదిరింపుల‌కు పాల్ప‌డిన బండి సంజ‌య్‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని ఇనుగాల డిమాండ్ చేశారు. పోక్సో కేసు బాధితురాలిని బెదిరిస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హన్మ‌కొండ‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు అత్యంత అమానవీయమని మండిపడ్డారు. న్యాయం కోసం తనను ఆశ్రయించిన 17 ఏళ్ల బాలికను ఓదార్చాల్సింది పోయి, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. నీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు అనే తరహాలో బండి సంజయ్ మాట్లాడటం ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. నాతో పెట్టుకుంటే మీకు ఏం జరిగినా నా బాధ్యత కాదు అంటూ బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ బెదిరించారని వెంకట్రామ్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, నిందితులకు కొమ్ముకాస్తూ బాధితులను మానసికంగా వేధించడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంగప్ప పాత్రపై అనుమానాలు
ఈ వ్యవహారంలో మాజీ జర్నలిస్ట్, బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన సంగప్ప పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధంగా ఉన్న సంగప్ప, ఈ కేసులో మధ్యవర్తిలా వ్యవహరించారని ఆరోపించారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ నివాసానికి తీసుకెళ్లిన నేపథ్యంలో, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం తమ వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ ఆధారాలను చూపించినప్పటికీ, వాటిని పరిశీలించకుండా బాధితులపైనే అనుమానాలు వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వెంకట్రామ్ రెడ్డి ప్రశ్నించారు. ఆధారాలను నిర్లక్ష్యం చేసి బాధితులనే నిందితులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ త‌రుపున డిమాండ్ చేస్తున్న‌ట్లు ఇనుగాల తెలిపారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లోని బండి సంజయ్ నివాసం పరిసరాల్లో ఏప్రిల్ 26 ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకోవాల‌ని అన్నారు. బండి సంజయ్, సంగప్ప, బాధిత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి వాస్తవాలను వెలికితీయాల‌న్నారు. బేటీ బచావో అంటూ ప్రచారం చేసే బీజేపీ నాయకులు, తమ సొంత వ్యవహారాల్లో మాత్రం ఆడపిల్లలను అవమానిస్తున్నారని వెంకట్రామ్ రెడ్డి విమర్శించారు. మహిళల భద్రతపై బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఘటనలో నిజాలు బయటకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.