epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డివిజన్ అయిన‌ట్టా.. కాన‌ట్టా..?!

డివిజన్ అయిన‌ట్టా.. కాన‌ట్టా..?!
సందిగ్ధంలో ఏటూరునాగారం ఏజెన్సీ ప్ర‌జ‌లు
క్యాబినేట్ ఆమోదం పొందిన క్షేత్ర‌స్థాయి ప్ర‌క్రియ పెండింగే
ఇంకా ములుగు నుంచే ఆఫీసులు ఆప‌రేటింగ్‌
ఏటూరునాగారం డివిజన్ కాగితాలకే ‘పరిమితం?
100 కిలోమీట‌ర్ల దూరంలోని ములుగుకు వెళ్ల‌డానికి ఆదివాసీల క‌ష్టాలు
మంత్రి సీత‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితిపై విమ‌ర్శ‌లు
అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లయినా ఎందుకు ఆల‌స్య‌మ‌వుతోందంటూ ప్ర‌శ్న‌లు

కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. అయిన‌ట్టా.. కాన‌ట్టా అన్న సందేహం ఏజెన్సీ ప్ర‌జ‌ల‌ను వేధిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ నుంచి మంత్రివర్గ ఆమోదం వరకు అన్నీ అంచెలంచెలుగా జరిగిపోయినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘డివిజన్’ కార్యాలయాలు ఏర్పాటు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. స్వ‌యంగా మంత్రి సీత‌క్క ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప‌రిస్థితి ఉండ‌టంపై ప్ర‌జ‌లు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఎంతో వేగంగా ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజ‌న్ కేంద్రంగా ప్ర‌క‌టించి.. ఆత‌ర్వాత ప్ర‌క్రియ‌ను కూడా అంతే వేగంగా పూర్తి చేసింది. అయితే ఇంత‌లోనే ఎన్నిక‌లు రావ‌డంతో.. క్షేత్ర‌స్థాయిలో జ‌ర‌గాల్సిన కార్యాలయాల ఏర్పాటు అంశం అటకెక్కింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు కావ‌స్తున్నా.. ఇప్ప‌టికీ ఏటూరునాగారం కేంద్రంగా రెవెన్యూ డివిజ‌న్ స్థాయి కార్యాల‌యాలు ఏర్పాటు కాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆశల పల్లకి.. అమలులో ముందడుగు ఏది?

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాలను కలిపి కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పాలన మారినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేయడంతో ఏజెన్సీ వాసుల్లో ఆశలు చిగురించాయి. సంబరాలు జరిగాయి. ఆమోదం పొంది నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయి జీవో వెలువడలేదు. పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అధికారుల నియామకంపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. పాలకులు మారినా, ప్రకటనలు వచ్చినా ఏటూరునాగారం ప్రజల కల మాత్రం ఇంకా ఫైళ్లలోనే మగ్గిపోతోంది.

దూరభారంతో అల్లాడుతున్న గిరిపుత్రులు

డివిజన్ కేంద్రం లేకపోవడంతో ఆరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్యలు, కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్కుల వంటి చిన్న అవసరాలకు కూడా వాజేడు, వెంకటాపురం వంటి మారుమూల ప్రాంతాల ప్రజలు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. డివిజన్ కేంద్రం అందుబాటులోకి వస్తే పరిపాలన చేరువవుతుందని భావించినా, అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల ఉదాసీనత వల్ల ఏజెన్సీ ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాలో ప్రస్తుతం ఒక్క ములుగు డివిజన్ మాత్రమే ఉండటంతో పనిభారం పెరిగి సేవలు కూడా ఆలస్యమవుతున్నాయి.

ముందడుగు పడేనా.. గాలిలో దీపమేనా?

ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం, కొత్త డివిజన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళాన్ని మరింత పెంచుతోంది. గెజిట్ వచ్చి, క్యాబినెట్ ఆమోదం పొందిన అంశాన్ని జీవో రూపంలోకి తెచ్చి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అడ్డంకులు ఎక్కడున్నాయంటూ గిరిజ‌న విద్యావంతులు ప్ర‌శ్నిస్తున్నారు. “ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ నిజంగానే వస్తుందా..? మరో హామీగానే మిగిలిపోతుందా..?” అన్న సందేహాలు ఇప్పుడు ఏజెన్సీ అంతటా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి సీత‌క్క‌, ప్ర‌భుత్వ‌ యంత్రాంగం స్పందించి రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.