epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భద్రాద్రి జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ కలకలం: రూ. 5 వేల సరుకులతో కేటుగాడు జంప్!

భద్రాద్రి జిల్లాలో ‘ఫేక్‌ ఫోన్‌పే’ కలకలం
రూ. 5 వేల సరుకులతో ఉడాయించిన కేటుగాడు
జిల్లాలో ఇది రెండో సంఘటన.. ఆందోళనలో వ్యాపారులు

కాకతీయ, భద్రాచలం (మణుగూరు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ ముఠా కలకలం రేపుతోంది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని అమాయక వ్యాపారులను కేటుగాళ్లు నిలువునా ముంచుతున్నారు. తాజాగా భద్రాచలం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక వ్యాపారులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం పట్టణంలోని నెహ్రూ మార్కెట్ సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణానికి ఒక అపరిచితుడు వచ్చాడు. సుమారు రూ. 5,000 విలువైన సరుకులను కొనుగోలు చేశాడు. నగదు చెల్లింపు సమయంలో తన మొబైల్‌లో ‘ఫేక్ ఫోన్‌పే’ యాప్‌ను ఉపయోగించి డబ్బులు పంపినట్లు స్క్రీన్‌పై చూపించాడు. సక్సెస్‌ఫుల్‌గా నగదు బదిలీ అయినట్లు వచ్చిన సందేశాన్ని చూసి, యజమాని నిజమేనని నమ్మాడు. సదరు వ్యక్తి సరుకులతో అక్కడి నుంచి వెళ్లిన తర్వాత, యజమాని తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకోగా ఒక్క రూపాయి కూడా జమ కాలేదని గుర్తించి లబోదిబోమన్నాడు.

సీసీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు
మోసపోయానని గ్రహించిన బాధితుడు దుకాణంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. భద్రాచలం పట్టణంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కస్టమర్లు ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు కేవలం వారి మొబైల్ స్క్రీన్ చూడటమే కాకుండా, మీ మొబైల్‌కు మెసేజ్ వచ్చిందా? లేదా? అని సరిచూసుకోవాలి. ఫోన్‌పే, జీపే వంటి యాప్‌లకు ‘వాయిస్ అలర్ట్’ బాక్సులను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద మొత్తంలో సరుకులు కొని ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ మోసాలతో మన్యం ప్రాంత వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఈ ఫేక్ యాప్‌ల ముఠాను పట్టుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.