epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్టోన్ క్రషర్ల‌ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి

స్టోన్ క్రషర్ల‌ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
బ్లాస్టింగ్‌తో గ్రామాన్ని కమ్మేసిన కాలుష్యం
ఆత్మ‌కూరులో క‌టాక్ష‌పూర్ గ్రామ‌స్థుల ఆందోళ‌న‌
సుమతి స్టోన్ క్రషర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్‌

కాక‌తీయ‌, ఆత్మకూరు : మండలంలోని కటాక్షపూర్ శివారులో ఉన్న సుమతి స్టోన్ క్రషర్ స్థానికులకు శాపంగా మారింది. క్రషర్ వల్ల వెలువడుతున్న కాలుష్యం, నిరంతరం జరుగుతున్న బ్లాస్టింగ్‌ల వల్ల ప్రాణహాని ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి, దాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం జాతీయ రహదారి 163పై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండు రోజులుగా క్రషర్‌లో భారీగా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనివల్ల గ్రామం మొత్తం ధూళి కాలుష్యంతో నిండిపోయింది. దీంతో గ్రామంలోని చిన్నారులు, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగ్‌ల ప్రభావం వల్ల క్రషర్ సమీపంలోని పంట పొలాలు కూడా పాడవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని కలిగించే ఈ క్రషర్‌ను తొలగించాలని కోరుతూ ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిలిచిన ట్రాఫిక్.. ఆందోళన
గ్రామస్తుల నిరసనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తులతో చర్చలు జరిపి ధర్నాను విరమింపజేశారు. క్రషర్ ఓనర్ అధికారులకు ‘చేతివాటం’ చూపడం వల్లే వారు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సుమతి స్టోన్ క్రషర్‌ను వెంటనే మూసివేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కటాక్షపూర్ ప్రజలకు మేలు చేయాలని వారు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.