epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో!

గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో!
ఆయన అధికారంలోకి వ‌చ్చాకా అన్ని వర్గాలు ఆగం
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
లేదంటే సమస్య తీరే వరకు నేనే ధర్నాలో కూర్చుంటా
సెంట్రింగ్ కార్మికుల 12 డిమాండ్లు పూర్తిగా సహేతుకమైనవే
పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వాత తప్పదు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : తెలంగాణలో గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే తాను ‘గుంపు మేస్త్రీ హఠావో…. తెలంగాణ బచావో’ అనే నినాదం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు దిగిన సెంట్రింగ్ కార్మికులతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, వారి సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులకు అండగా సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్ని రోజులైనా తానే స్వయంగా ధర్నాలో కూర్చుంటానని ఆమె స్పష్టం చేశారు. 12 ప్రధాన డిమాండ్లతో ఇందిరాపార్క్ వద్ద నిరసన చేపట్టిన సెంట్రింగ్ కార్మికుల ధర్నా శిబిరానికి శనివారం కవిత చేరుకుని వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హైదరాబాద్ నగర నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. ఆకాశహర్మ్యాలు, అద్దాల మేడల వెనుక వారి శ్రమ దాగి ఉందని కొనియాడారు. ప్రాణాలను పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ పనిచేసే కార్మికులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆగమావుతున్నారని, అందుకే ‘గుంపు మేస్త్రీ హఠావో… తెలంగాణ బచావో’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు.

కార్మికుల డిమాండ్లు సహేతుకమైనవే
భవన నిర్మాణ ఒప్పందాల్లో సెంట్రింగ్ కార్మికుల పేరుతో అగ్రిమెంట్లు ఉండటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని, స్క్వేర్ ఫీట్‌కు 51 రూపాయల కూలీ నిర్ణయించాలని, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఇచ్చే పరిహారాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచాలని వారు కోరుతున్నారని తెలిపారు. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రభుత్వం మనసు పెడితే రెండు రోజుల్లోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2 లక్షల రూపాయల పని కోసం 15 లక్షల రూపాయల విలువైన మెటీరియల్‌ను తీసుకెళ్లాల్సి వస్తోందని, కానీ వాటికి రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన వెంటనే సెంట్రింగ్ కార్మికులు, యాజమాన్యాలు కోరుతున్న అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని కవిత హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 86 చోట్ల వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలాన్ని కార్మికుల కోసం కేటాయిస్తామని వెల్లడించారు. ప్రతి మండలంలోనూ సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు అధైర్యపడకుండా తమ హక్కుల సాధన కోసం పోరాడాలని, వారికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సెంట్రింగ్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.