epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వృత్తిపై నిబద్ధత కలిగిన వ్యక్తి మహబూబ్ రెడ్డి!

వృత్తిపై నిబద్ధత కలిగిన వ్యక్తి మహబూబ్ రెడ్డి!
ఏసిపి నాగన్న, వాలీబాల్ అసోసియేషన్ నాయకుల ప్రశంస
పదవీ విరమణ చేసిన ఆర్టీసీ డిపో హెడ్ కానిస్టేబుల్‌కు ఘన సన్మానం
ఖాకీ చొక్కా విడిచినా క్రీడా స్ఫూర్తిని వీడనని భావోద్వేగం
కాకతీయ, ఇనుగుర్తి : ఉద్యోగ బాధ్యతల్లో వృత్తి పట్ల నిబద్ధత, ప్రవృత్తిపై అమితమైన ప్రేమ ఉన్న అరుదైన వ్యక్తి పరుపాటి మహబూబ్ రెడ్డి అని ఏసిపి నాగన్న, వాలీబాల్ అసోసియేషన్ నాయకులు కొనియాడారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో హెడ్ కానిస్టేబుల్‌గా సుదీర్ఘ కాలం పాటు నిరుపమానమైన సేవలు అందించి పదవీ విరమణ పొందిన పరుపాటి మహబూబ్ రెడ్డికి క్రీడా లోకం ఘనంగా నీరాజనం పలికింది. జిల్లా వాలిబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసిపి నాగన్న మాట్లాడుతూ.. ఉద్యోగ బాధ్యతల్లో ఖాకీ దుస్తుల వెనుక ఎంతటి కఠినత్వం ఉన్నా, వాలీబాల్ మైదానంలో ఆయన క్రీడాకారుడిగా చూపిన నిబద్ధత, క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఒక చేత్తో శాంతిభద్రతలను కాపాడుతూనే, మరోచేత్తో క్రీడారంగాన్ని ప్రోత్సహించడం ఆయనకే సాధ్యమైందని చెప్పారు. ఉద్యోగ విరమణ అనేది కేవలం ఒక సర్వీసుకు మాత్రమేనని, క్రీడలతో ఉన్న బంధానికి ఎప్పటికీ విరమణ ఉండదని స్పష్టం చేశారు.
క్రీడల అభివృద్ధికి శేషజీవితం అంకితం
అనంతరం సన్మాన గ్రహీత, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పరుపాటి మహబూబ్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, కానీ వాలీబాల్ ఆట తనకు ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఖాకీ చొక్కా విడిచినా.. క్రీడా స్ఫూర్తిని మాత్రం ఎప్పటికీ వీడనన్నారు. వాలీబాల్ అసోసియేషన్ తనను సొంత కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అద్భుతమైన గౌరవాన్ని అందించడం జీవితంలో మరువలేని ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. తన శేష జీవితాన్ని కూడా వీలైనంత వరకు క్రీడల అభివృద్ధికి, తోటి క్రీడాకారుల ప్రోత్సాహానికే అంకితం చేస్తానని ప్రకటించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, వద్దిరాజు పెద్ద వెంకన్న, దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు, కన్నా సాంబయ్య, వెంకటేశ్వర్లు, పరుపాటి రవిందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శీలం మధుసూదన్, బేతమల్ల చంద్రయ్య, కుమార్, దేవి రెడ్డి, సంజీవ్ రెడ్డి, వెంకటసోములు, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, ఆర్టీసీ డిపో సిబ్బంది, క్రీడాభిమానులు మరియు ఇనుగుర్తి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు మిల్లర్లలో గుబులు!

ములుగు మిల్లర్లలో గుబులు! ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం అధ్యక్షుడు సతీష్‌ పేరుతో వైరల‌వుతున్న...

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.