epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యం

బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యం
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గ‌ద్దెదింప‌డం ఖాయం
ప‌రకాల‌ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
జాన్‌పాక‌, ధర్మారం గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ కమిటీ సమావేశాలు

కాకతీయ, గీసుగొండ : రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని,ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పబోతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని జాన్పాక,ధర్మారం గ్రామాల్లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదని,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, మహిళలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకే కొత్త శిలాఫలకాలు వేయడం తప్ప కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని విమర్శించారు.
గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని,బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు.కేంద్రం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని,కష్టకాలంలో కార్యకర్తలను వదిలిపెట్టేది బిఆర్ఎస్ పార్టీ కాదని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇనమాముల మాజీ డైరెక్టర్ గోలి రాజయ్య, యువ నాయకులు సుంకరి శివకుమార్, గాడిదల రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పులుగు వీరారెడ్డి మృతిచెందగా,ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఇటీవల మృతిచెందిన సోనబోయిన సమ్మయ్య కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బోడకుంట్ల ప్రకాష్, గుర్రం రఘు,యూత్ అధ్యక్షుడు సిరిషే శ్రీకాంత్,ముఖ్య కార్యకర్తలు, యువజన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.