epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇక్క‌డి భూములు ఆక్ర‌మిస్తామంటే ఊరుకోం

ఇక్క‌డి భూములు ఆక్ర‌మిస్తామంటే ఊరుకోం
తాత ముత్త‌తాల నుంచి ఈ నేల‌తో అనుబంధం
గిరిజ‌నేత‌రుల‌ను ఇక్క‌డి నుంచి ఎవ‌రు దూరం చేయ‌లేరు
ఆదివాసుల ముసుగులో కొంత‌మంది ఆగ‌డాలు
రాళ్లకుంట చెరువు సర్వే నంబర్ 209లో ఆక్రమాలు
బడే సులోచన, శమంతకమణి, పెనక నాగమణులపై గండేపల్లి సత్యం ధ్వ‌జం
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అటవీ శాఖకు విజ్ఞప్తి
తమ చెరువు భూమి జోలికొస్తే ఊరుకునేది లేదన్న మహాలక్ష్మి

కాకతీయ, ఏటూరునాగారం రూర‌ల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంలోని రాళ్లకుంట చెరువు శివారు భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు రేకెత్తుతుతున్నాయి. సర్వే నంబర్ 209లో గల ప్రభుత్వ భూమిని, చెరువు శివారు ప్రాంతాలను ఆదివాసుల పేరుతో కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని గండేపల్లి సత్యం విమర్శలు చేశారు. బడే సులోచన, శమంతకమణి, పెనక నాగమణిలు ఆదివాసులమనే ముసుగులో చట్టవిరుద్ధంగా భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. కొందరి స్వార్థపూరిత చర్యల వల్ల గిరిజనుల ఆత్మగౌరవం మంటగ‌లుస్తోంద‌ని, చట్టాన్ని గౌరవించే, ప్రకృతిని కాపాడే ఆదివాసీ జాతికి వీరి వల్ల చెడ్డపేరు వస్తోందని అన్నారు. రాళ్లకుంట చెరువు పరివాహక ప్రాంతంలోని భూములను కబ్జా చేయడం వల్ల రాబోయే వర్షాకాలంలో ముంపు ముప్పు పొంచి ఉందని, భూగర్భ జలాలు దెబ్బతినే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చట్టంతోనే బుద్ధి చెబుతాం

ఈ వ్యవహారంపై మహాలక్ష్మి మాట్లాడుతూ రాళ్లకుంట చెరువు మా తాతల కాలం నుంచి మా జీవనాధారం. ఈ నేల మీద మా హక్కును ఎవరూ కాలరాయలేరు. ఆదివాసుల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా, మా ఊరి పరువు తీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేద‌ని మ‌హాల‌క్ష్మి ఘాటుగా హెచ్చ‌రిక‌లు చేశారు. చెరువు భూమి జోలికొస్తే, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండానే చట్టపరంగానే బుద్ధి చెబుతామంటూ పేర్కొన్నారు. గిరిజనులు, గిరిజనేతరులు వందల ఏళ్లుగా ఇక్కడ కలిసి ఉంటున్నామని, దయచేసి తమ మధ్య చిచ్చు పెట్టవద్దని ఆమె కోరారు. సర్వే నంబర్ 209లో జరుగుతున్న అక్రమాలపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సత్యం డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సర్వే నిర్వహించి వాస్తవాలను బయటపెట్టి, ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.