epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అభిమాని నిరంజ‌న్‌ ఇంటికి ప‌వ‌న్‌

అభిమాని నిరంజ‌న్‌ ఇంటికి ప‌వ‌న్‌
అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌
ప‌వ‌న్‌ను చూడాల‌నే కోరికను నెర‌వేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం
హన్మ‌కొండ హనుమాన్ నగర్‌లోని ఇంటికి వెళ్లిన జనసేనాని
రూ. లక్ష సాయం.. తిరుమ‌ల తీర్థప్రసాదాల అందజేత‌
పరామర్శ అనంతరం నేరుగా భద్రకాళి ఆలయానికి పయనం

కాక‌తీయ‌,హ‌న్మ‌కొండ : అరుదైన జన్యుపరమైన డీఎండీ (డ్యూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన యువ అభిమాని పొనుగోటి నిరంజన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. అభిమానిగా తనను ఒక్కసారి కలవాలన్న నిరంజన్ కోరికను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ ఇంటికే వెళ్లి అతనితో ఆత్మీయంగా మాట్లాడారు. హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, అతని ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న వైద్యం, భవిష్యత్ చికిత్స అవకాశాలపై ఆరా తీశారు.

భావోద్వేగానికి గురైన జనసేనాని

నిరంజన్‌కు ధైర్యం చెబుతూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపిన పవన్ కళ్యాణ్, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.ల‌క్ష ఆర్థిక సాయం అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నిరంజన్‌ను చూసిన పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అతని మంచం పక్కనే కూర్చొని ఆప్యాయంగా హత్తుకుని, నుదిటిపై ముద్దు పెట్టి పలకరించారు. చిన్నప్పటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అని నిరంజన్ చెప్పడంతో ఆయన చలించిపోయారు. తిరుమల నుంచి తెప్పించిన వస్త్రాన్ని కప్పి, కళ్యాణం అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్ వీడియోలు, ఫొటోలను కూడా ఆయన పరిశీలించారు.

కుటుంబ జీవనోపాధికి ఉపాధి హామీ
తనను అందరూ చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ ఒక కుక్కపిల్లను పెంచుకోవాలన్న తన కోరికను వెల్లడించగా, దానిని కొని పంపిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇంటి యజమానుల అనుమ‌తి అవసరమని నిరంజన్ తండ్రి చెప్పడంతో వారితో స్వయంగా మాట్లాడారు. అలాగే నిరంజన్ కుటుంబ జీవనోపాధిపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్, గతంలో వారు ఆస్పత్రి క్యాంటీన్‌లో పనిచేసిన విషయాన్ని తెలుసుకుని, కుటుంబానికి ఉపాధి కల్పించేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ నాయకులకు సూచించారు. నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కే. సాగర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.