epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్‌లో ప్రొటోకాల్ ర‌గ‌డ‌

  • ములుగు బీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త క‌ల్లోలం
  • జిల్లా నాయకత్వం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధ్య సమన్వయ లోపం
  • ప్రోటోకాల్ వివాదంతో సీనియర్లలో పెరుగుతున్న అసహనం
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో అయోమయం
  • రాష్ట్ర‌ నాయకత్వం స్పందన కోసం ఎదురుచూపులు

కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగజ్యోతి, ఇటీవల జిల్లా స్థాయి కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏటూరునాగారం కేంద్రంగా మొదలైన ఈ అసంతృప్తి, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ శ్రేణుల్లో ఐక్యత కంటే వర్గ ప్రాబల్యం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రోటోకాల్ వివాదం.. సీనియర్ల అసహనం
పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంలో పాటించాల్సిన సంస్థాగత ప్రోటోకాల్‌ను కొందరు విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల పేర్లను అధికారిక ప్రచారంలో ప్రస్తావించడం లేదని, ఫోటోలు, ప్రెస్ నోట్లలో కూడా గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై వివరణ కోరిన వారికి మర్యాదపూర్వక స్పందన లభించడం లేదని, దీనివల్ల పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారు పక్కకు నెట్టబడుతున్నారనే భావన క్షేత్రస్థాయిలో బలపడుతోంది.

రాష్ట్ర‌ నాయకత్వం మౌనం..
ఈ పరిణామాలపై పలువురు సీనియర్ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలోనే నాగజ్యోతి సోషల్ మీడియా బాధ్యులకు పార్టీ నిబంధనల గురించి సూచించినా, పరిస్థితిలో మార్పు రాలేదని సమాచారం. ఎన్నికల సమయంలో “అందరం ఒక్కటే” అని నినదించిన నాయకులు, ఎన్నికల తర్వాత సమన్వయ లోపంతో ఇబ్బందులు పడటం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.

స్థానిక ఎన్నికల వేళ హెచ్చరికలు
త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంతర్గత పరిణామాలు పార్టీ ఎన్నికల సన్నద్ధతపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. ఏటూరునాగారం వేదికగా మొదలైన ఈ అసంతృప్తి ఇతర మండలాలకు కూడా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా నాయకత్వం చొరవ తీసుకుని, అన్ని వర్గాల నాయకులతో సమావేశమై అపోహలను తొలగించి, పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి, స్థానిక ఎన్నికల సమయానికి జిల్లా నాయకత్వం ఈ విభేదాలను పరిష్కరిస్తుందా? లేక ఈ కల్లోలం రానున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అన్నది ఏజెన్సీ ప్రాంత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.