గ్రీవెన్స్ డేకు ఆలస్యంగా ఎమ్మార్వో
గంటల తరబడి వేచిచూసిన ప్రజలు
వినతుల పరిష్కారంలో జాప్యంపై అసంతృప్తి
కాకతీయ, ఏన్కూర్: ఏన్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) ఆలస్యంగా హాజరుకావడంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఇతర శాఖల అధికారులు సమయానికి చేరుకున్నప్పటికీ, ఉదయం 11 గంటలు దాటినా ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో భూ వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్లు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలకు సంబంధించిన పలు వినతుల పరిష్కారం ఆలస్యమైంది. ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే కార్యక్రమాల్లో అధికారులు సమయపాలన పాటించాలని స్థానికులు కోరారు. ఎమ్మార్వో ఆలస్యానికి గల కారణాలపై అధికారిక సమాచారం వెల్లడికాలేదు.

