బీఆర్ఎస్ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి
గుండెపోటుతో తాజుద్దీన్ అకాల మరణం
పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి
పార్టీకి, మైనారిటీ సమాజానికి తీరని లోటని సంతాపం
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కాకతీయ, ఖమ్మం : బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తాజుద్దీన్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి, ముస్లిం మైనారిటీ సమాజానికి, కుటుంబానికి తీరని లోటని పువ్వాడ అజయ్‌కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాజుద్దీన్‌తో తనకున్న అనుబంధాన్ని, పార్టీ కోసం ఆయన చేసిన సేవలను పువ్వాడ అజయ్‌కుమార్ గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాజుద్దీన్ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించిన ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. తాజుద్దీన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఖమ్మం నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, ఖమర్, కర్నాటి కృష్ణ, భీరెడ్డి నాగచంద్రరెడ్డి, బత్తుల మురళి తదితరులు తాజుద్దీన్ పార్థివదేహంపై బీఆర్ఎస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

