మాస్టర్‌జీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ
హెడ్ బాయ్‌గా ప్రద్యుమ్న, హెడ్ గర్ల్‌గా అవని బాధ్యతల స్వీకరణ
కాకతీయ, హనుమకొండ : కిషన్‌పురాలోని మాస్టర్‌జీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ ఘనంగా నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్, మాస్టర్‌జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎస్. సుందర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావంతో నాయకత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా హెడ్ బాయ్‌గా జె. ప్రద్యుమ్న, హెడ్ గర్ల్‌గా అవని బాధ్యతలు స్వీకరించగా, 23కు పైగా విభాగాలకు విద్యార్థి నాయకులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రిన్సిపాల్ డి. రజిత, వైస్ ప్రిన్సిపాల్ రాధిక, ఏఓ నాగరాజు, పీఈటీ రాజాబాబు, ఇందిర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం నాయకత్వ లక్షణాలు, టీమ్‌వర్క్, సేవాభావాన్ని పెంపొందించేలా సాగింది.

