epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జీడబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యం

జీడబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యం
ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్‌ పకడ్బందీ వ్యూహం
డివిజన్ల వారీగా బలాబలాలపై మంత్రి పొంగులేటి సమీక్ష
క్షేత్రస్థాయి బలోపేతంపై ప్రత్యేక దృష్టి
ఓటర్ల జాబితాపై పక్కా నిఘా..
డీసీసీ భవన్‌కు భూమిపై సానుకూల స్పందన
పొంగులేటి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

కాకతీయ, హన్మకొండ : రాబోయే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఇంచార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేసి, స్థానిక సమస్యలను గుర్తించి గెలుపు వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ భవన్‌కు వచ్చిన మంత్రికి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.

ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి

ప్రస్తుత ఓటర్ల జాబితాలోని తప్పుడు చిరునామాలు, బోగస్‌ ఓట్లు, నాన్‌ మ్యాపింగ్‌ ఓటర్లను గుర్తించి అవసరమైన సవరణలు, తొలగింపులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జాబితాను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడగట్టాలని నూతన మండల, డివిజన్‌ అధ్యక్షులకు సూచించారు. హనుమకొండ జిల్లా నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయింపు ప్రతిపాదనను రాబోయే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ప్రవేశపెట్టి త్వరగా ఆమోదం లభించేలా చొరవ తీసుకోవాలని జిల్లా నాయకులు పొంగులేటిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. పీఏసీఎస్‌లు, స్టేట్‌ డైరెక్టర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్ల పదవుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని, ప్రతిపాదనలను డీసీసీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపేలా సమన్వయం చేయాలని నిర్ణయించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన 13 మండల అధ్యక్షులు, 10 డివిజన్‌ అధ్యక్షులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. సమావేశంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె.ఆర్‌.నాగరాజు, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వొడితెల ప్రణవ్‌, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్‌ కాంగ్రెస్‌ హనుమకొండ చైర్మన్‌ పింగిలి వెంకట్రామ్‌ నరసింహారెడ్డి, మాజీ మేయర్‌ గుండు సుధారాణి, వివిధ చైర్మన్లు రియాజ్‌, అజీజ్‌ఖాన్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఈవీ శ్రీనివాస్‌రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నూతనంగా నియమితులైన 13 మండల అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 10 డివిజన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.