తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత
కాకతీయ, తుంగతుర్తి: తాను చిన్ననాడు ఓనమాలు నేర్చిన వెంపటి ప్రాథమిక పాఠశాలకు మాజీ ఉపసర్పంచ్ భాష బోయిన వెంకన్న చేయూత అందించారు. తన తల్లిదండ్రులు భాష బోయిన అంజయ్య–ఉప్పలమ్మ జ్ఞాపకార్థం డ్రమ్ములను గ్రామస్తుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బివనపల్లి శ్రీనివాస్‌కు అందజేశారు. తాను ఎదగడానికి పునాది వేసిన పాఠశాలకు తిరిగి సహాయం చేయడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రార్థనలు, జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు డ్రమ్ములు ఉపయోగపడనున్నాయి. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని వెంకన్న తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, వార్డు సభ్యుడు పులిగుజ్జ నరసయ్య, మాజీ సర్పంచ్ అబ్బగాని సత్యనారాయణ గౌడ్, మాదరబోయిన రవి, సూదగాని రాజయ్య, సగ్గం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

