రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
ఘట్‌కేసర్ సమీపంలో ఘటన
చెన్నారావుపేట మండలం పాపయ్యపేట వాసులు
కాకతీయ,నర్సంపేట : వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు మృతి చెందడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలా లేక ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


