epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?
సాగర్‌ నీటిపై జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి
పోతిరెడ్డిపాడు ద్వారా 148 టీఎంసీల తరలింపు
ఎడమ కాల్వ, లిఫ్టులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి
నీటి వాటా సాధించేంత వరకు రైతుల తరఫున పోరాడుతాం
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

కాకతీయ, నల్లగొండ : శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌ నిత్యం నీటిని తరలించుకుపోతున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే జిల్లాలో వ్యవసాయం ఆగమవుతోందని ఆరోపించారు. సాగర్‌లో 532 అడుగుల నీటిమట్టం ఉందని, సుమారు 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎడమ కాల్వకు నీరు విడుదల చేయకపోవడానికి కారణమేంటో జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలంలోకి వరద వస్తున్నా ఆ నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు తరలిపోతోందని ఆరోపించారు. రైతుల నీటి వాటా కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం నల్లగొండలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ నీటిని ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు. తాను ఆధారాలతో సహా ఆంధ్రా నీటి దోపిడీని ప్రజల ముందు ఉంచుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.

రాయలసీమ ప్రాజెక్టులన్నీ నింపుకున్నారు

శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సాగర్‌ ఓవర్‌ఫ్లో అయి సముద్రంలోకి నీటిని విడుదల చేసిన సమయంలో మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ నిబంధనలను పట్టించుకోకుండా నీటిని తరలించుకుపోతున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను నింపుకున్నారని ఆరోపించారు. సాగర్‌లో నీటిమట్టం తక్కువగా ఉన్న సమయంలోనూ తెలంగాణలో సాగుకు నీరు అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. వరుసగా 17 సార్లు సాగునీరు అందించామని, ఎడమ కాల్వ కింద ఉన్న లిఫ్టులకు కూడా పుష్కలంగా నీటిని విడుదల చేశామని చెప్పారు. ఇప్పుడు సాగర్‌లో నీరు ఉన్నా రైతులకు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు.

ఎడమ కాల్వతో పాటు లిఫ్టులకూ నీళ్లు

సాగర్‌ ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎడమ కాల్వకు మాత్రమే కాకుండా దాని పరిధిలోని లిఫ్టులకు కూడా నీటిని విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పంటలు సాగవుతున్నప్పుడు తెలంగాణ రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాగర్‌ నీరు తెలంగాణ రైతుల హక్కు అని స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు పదవుల భయంతో ఆంధ్రప్రదేశ్‌కు లొంగిపోయి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించి సాగర్‌ ఆయకట్టు రైతులు తప్పు చేశారని, ఇప్పటికైనా రైతులు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీసి సాగునీటి కోసం ప్రశ్నించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 148 టీఎంసీల నీటిని తరలించుకుపోయారని అన్నారు. ఇది ఎల్‌నినో వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు అని విమర్శించారు. యాగాల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలంలోకి వస్తున్న నీరు ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసని, పోతిరెడ్డిపాడు ద్వారా ఆ నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించే వరకు బీఆర్‌ఎస్‌ రైతుల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, ఎలాగైనా తెలంగాణ నీటి వాటాను సాధిస్తామని జగదీశ్‌రెడ్డి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి తుంగతుర్తి ప్రాంతానికి నీటిని విడుదల చేయాలి వర్షాభావంతో ఎండుతున్న...

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచిన...

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు...

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి కాకతీయ, భువనగిరి : భువనగిరి...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత కాకతీయ, తుంగతుర్తి: తాను చిన్ననాడు ఓనమాలు నేర్చిన...

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య తుంగతుర్తిలో...

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేత హైదరాబాదులో...

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య ఘట్‌కేసర్ సమీపంలో ఘ‌ట‌న‌ చెన్నారావుపేట మండలం పాపయ్యపేట...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.