ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారమే ధ్యేయం
గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్‌లది కీలక పాత్ర
ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్
ములుగులో ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం
నూతన మండలాల కమిటీల నియామకం
కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ అన్నారు. గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల సన్నిధిలో ములుగు జిల్లా ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్‌లు హాజరై గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల్లో తమ పాత్ర, ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ములుగు జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అంకం సురేష్ ముదిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోట్ల కార్తీక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలిగా సప్పిడి సంజనను నియమించారు. ఏటూరునాగారం మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కోడి ధర్మరాజు, గోవిందరావుపేట మండల అధ్యక్షుడిగా వెంగల రాజును నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇటవీన రాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు చింత ప్రకాశ్, జిల్లా కార్యదర్శి చింతనిపుల రఘు, వివిధ మండలాల అధ్యక్షులు, అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.

