చదువుపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సహకారం
మౌలిక వసతుల కల్పనకు చేయూత
చేయూత మిత్రబృందం నిర్వాహకులు పొదిల రాజేష్, బైరి రమణారెడ్డి
విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిళ్ల పంపిణీ
కాకతీయ, భూపాలపల్లి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేయూత మిత్రబృందం ఆధ్వర్యంలో చిన్నకోడెపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం పాఠశాల బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు చాడ అనితారెడ్డి సమక్షంలో సుమారు 80 మంది విద్యార్థినీ, విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని చేయూత మిత్రబృందం నిర్వాహకులు పొదిల రాజేష్, బైరి రమణారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో సమస్యలు, మౌలిక వసతుల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
చదువుపై ఆసక్తి పెంచేందుకు
విద్యార్థులకు ఉపయోగపడే సామగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపై మరింత ఆసక్తి పెంపొందించడమే తమ ఉద్దేశమన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో చేయూత మిత్రబృందం నిర్వాహకులు పొదిల రాజేష్, బైరి రమణారెడ్డి ,చేయూత మిత్రబృందం సభ్యులు మాటేటి సురేష్, మాటేటి త్రివిన్, దొరి హరికృష్ణ, కట్ల రాజు రెడ్డి, గుండు సందీప్, దొరి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ సాధు సుమలత ధర్మేందర్, ఉపాధ్యాయులు రాములు, రమేష్, మార్త రాజేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.

