epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి
గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి
అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి
అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి సీతక్క ఆదేశం

కాకతీయ, ఏటూరునాగారం : ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే గ్రీవెన్స్‌ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి పరిష్కారం చూపాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మండల ప్రజావాణి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తుపై అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించడంతో పాటు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని, దరఖాస్తుదారులకు సమస్య పరిష్కార పురోగతిని తెలియజేయాలని సూచించారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగుల పింఛన్‌ దరఖాస్తులను ఈ నెల 31లోగా స్వీకరించాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన గీత కార్మికులు, నేత కార్మికులు, తలసేమియా బాధితులకు పింఛన్లు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, గూడేల్లో పర్యటించి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సీతక్క సూచించారు. పస్రా, గోవిందరావుపేట, చల్వాయి ప్రాంతాల్లో రహదారులు, గిరిజన తండాలు, గూడేల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌, ఎంపీడీవో వరుణ్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.