భద్రకాళి బండ్పై ఎలక్ట్రిక్ వెహికిల్ సేవలు
వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సౌకర్యం – ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు
భద్రకాళి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా నిర్మించిన భద్రకాళి బండ్పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్ సేవలను మంగళవారం అధికారులు ప్రారంభించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న, కుడా అధికారులు కలిసి ఈ సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దూరం నడవలేని వారు బండ్పై సులభంగా సందర్శించేందుకు ఎలక్ట్రిక్ వెహికిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భద్రకాళి చెరువు సుందరీకరణతో నగరానికి మరింత అందం చేకూరిందని, భక్తులు, పర్యాటకులు ప్రశాంతంగా విహరించేలా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
భద్రకాళి దేవస్థానం, చెరువు పరిసరాలను
ఆధ్యాత్మికత + పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిద్దేందుకు ప్రభుత్వం, కుడా సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
బండ్పై పచ్చదనం, నడక మార్గాలు, ఇతర వసతులు అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్లో సందర్శకుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
కార్యక్రమంలో కుడా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

