epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నా తండ్రి మరణానికి సీతక్కే కారణం

నా తండ్రి మరణానికి సీతక్కే కారణం
నా కుటుంబ విషాదాన్ని రాజకీయాలకు వాడొద్దు
కాంగ్రెస్‌ నేతల ఇసుక, భూదందాలను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి ప్రస్తావన
సతీష్‌రెడ్డికి మా కుటుంబ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు
ములుగు మండల మాజీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి

కాకతీయ, వరంగల్‌ బ్యూరో: దాదాపు 39 ఏళ్ల క్రితం జరిగిన తమ కుటుంబ విషాదాన్ని ఇప్పుడు రాజకీయ వివాదంలోకి లాగడం సరికాదని ములుగు మండల మాజీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతల ఇసుక, భూదందాలు, సెల్‌ఫోన్‌ స్కామ్స్‌పై సతీష్‌రెడ్డి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తన తండ్రి మరణం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి మరణానికి అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటనతో సతీష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన తండ్రిని మాట్లాడి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లారని, అనంతరం ఆయన మృతదేహాన్ని ఇంటికి పంపించారని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘటన జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచిన తర్వాత దానిని ప్రస్తుత రాజకీయాలకు ముడిపెట్టడం బాధాకరమన్నారు. తన తండ్రి మరణాన్ని సతీష్‌రెడ్డికి ఆపాదించడం సమంజసం కాదని చెప్పారు.
కాంగ్రెస్‌ నాయకుల ఇసుక దందాలు, భూదందాలు, సెల్‌ఫోన్‌ స్కామ్స్‌ తదితర అంశాలను సతీష్‌రెడ్డి ప్రజల దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. దీంతో ఆయనపై రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకే తమ కుటుంబానికి సంబంధించిన పాత విషాదాన్ని బయటకు తీస్తున్నారని ఆరోపించారు.

చనిపోయింది నా తండ్రి

“చనిపోయింది నా తండ్రి. ఆ ఘటనపై బాధ, ఆవేదన ఎవరికైనా ఉంటే మొదట నాకు ఉండాలి. సతీష్‌రెడ్డికి మా కుటుంబ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ స్వలాభం కోసం ఈ విషాదాన్ని ఆయనకు ఆపాదించడం సరికాదు” అని రమేష్‌రెడ్డి అన్నారు. తాను, సీతక్క కుమారుడు కుంజ సూర్య చిన్న వయసులోనే తమ తండ్రులను కోల్పోయామని తెలిపారు. తమ కుటుంబాల్లో జరిగిన విషాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. ములుగులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనించాలని రమేష్‌రెడ్డి కోరారు. ఎవరు ఏ అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారో ఆలోచించాలని సూచించారు. తన తండ్రి మరణం తమ కుటుంబానికి ఎప్పటికీ మాయని విషాదమని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. తన కుటుంబ ఘటనను ప్రస్తుత రాజకీయ వివాదాలకు ఆపాదించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.