మచిలీ బజార్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన విష్ణువర్ధన్‌రెడ్డి
కాకతీయ, హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ మచిలీ బజార్‌లో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని విష్ణువర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల మధ్య సోదరభావం, మత సామరస్యం మరింత బలోపేతం కావాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

