ఎస్సీ డిపార్ట్‌మెంట్ సమావేశానికి స్థల పరిశీలన
ఈ నెల 30న హనుమకొండలో మూడు జిల్లాల సమావేశం
హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఏర్పాట్ల పరిశీలన
దళిత సంక్షేమం, అభివృద్ధిపై సమావేశంలో చర్చ
నాయకులు, కార్యకర్తలు, దళితులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
కాకతీయ, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించనున్న హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల ఎస్సీ డిపార్ట్‌మెంట్ సమావేశం కోసం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో స్థల పరిశీలన చేపట్టారు. హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు చిలివేరు శ్రీనివాస్‌తో కలిసి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్‌లో అమలు చేయనున్న కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పరశురామ్, చందు, శ్వేత, కర్నేల్, శ్రీనివాస్, చిరంజీవి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

