epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హరికుమార్‌ అంటే హడలెందుకు?

హరికుమార్‌ అంటే హడలెందుకు?
గ‌తంలోనే కాంట్రాక్ట‌ర్ కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు!
మెమో జారీ చేయాలన్న కలెక్టర్ నుంచి ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు
విచారణకూ ముందుకు రాని బల్దియా ఇంజ‌నీరింగ్ ఉన్న‌తాధికారులు
తాజాగా పనులు చేయకుండానే బిల్లుల వ్యవహారంలో చేతివాటం ఆరోపణలు
రూ.5 లక్షల కమీషన్‌ ఫోన్‌పే వ్యవహారంపై కమిషనర్ వెంక‌న్న‌ దృష్టి

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ మహానగర పాలక సంస్థలో ఇంజినీరింగ్‌ అధికారి హరికుమార్‌ అంటే ఉన్నతాధికారులకు ఎందుకింత హడలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనపై గతంలోనే కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు రావడం.. దీనిపై హరికుమార్‌కు మెమో జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం విచారణకు కూడా ముందుకు రాకపోవడం బల్దియా ఇంజినీరింగ్‌ విభాగంలో ఆయనకున్న పలుకుబడికి నిదర్శనమన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగానే తాజాగా అభివృద్ధి పనుల విషయంలోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతరే?

హన్మకొండ ప్రాంతంలో ఇంజినీరింగ్‌ అధికారిగా పనిచేస్తున్న హరికుమార్‌పై గతంలో ఓ కాంట్రాక్టర్‌ కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం హరికుమార్‌కు మెమో జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆదేశాల మేరకు మెమో జారీ చేశారా? ఫిర్యాదుపై విచారణ చేపట్టారా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. జిల్లా కలెక్టర్‌ స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినా వాటిని అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫిర్యాదులోని అంశాలు నిజమో కాదో తేల్చేందుకు విచారణ జరపాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా చర్యలు కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది.

తాజాగా బిల్లుల వ్యవహారంలో ఆరోపణలు

గత వ్యవహారం మరుగునపడకముందే తాజాగా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంలో హరికుమార్‌పై మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.5 లక్షలు ముందుగానే కమీషన్‌గా ఫోన్‌పే ద్వారా తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారిక నిర్ధారణ అవసరం. నిజంగా రూ.5 లక్షల లావాదేవీ జరిగిందా? జరిగితే ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాకు డబ్బు బదిలీ అయింది? సంబంధిత పనికి సంబంధించిన ఫైల్‌లో ఏం ఉంది? పనులు పూర్తయ్యాయా? బిల్లుల ప్రక్రియ ఎక్కడ ఉంది? వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కమిషనర్‌ దృష్టికి వ్యవహారం

తాజా ఆరోపణల నేపథ్యంలో బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం. హరికుమార్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలించి చర్యల అంశాన్ని చూడాలని సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారైనా వ్యవహారం విచారణ దశ దాటి చర్యల వరకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కలెక్టర్‌ ఆదేశాల అమలుపై స్పష్టత లేకపోవడం, తాజాగా కమిషనర్‌ స్థాయిలో దృష్టి సారించినట్లు సమాచారం రావడంతో బల్దియా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరోపణలు నిరాధారమైతే రికార్డులతో స్పష్టత ఇవ్వాలి.. నిజమైతే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఒకే అధికారిపై వరుస ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.