epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!
మామిడిపల్లిలో శిథిలాల కింద చిక్కుకుని మహిళ దుర్మరణం
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని గ్రామస్థుల ఆరోపణ
అర్హులైన పేదలకు ఇళ్లు అందుతున్నాయా? అంటూ ప్రశ్నలు
గుమ్మడి లక్ష్మి (బుజ్జక్క) మృతితో గ్రామంలో తీవ్ర విషాదం

కాకతీయ, కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మి (బుజ్జక్క) నివాసం ఉంటున్న పాత ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మి కుటుంబం చాలాకాలంగా శిథిలావస్థకు చేరిన పాత ఇంట్లోనే జీవిస్తోంది. ఇంటి పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో కొత్త ఇల్లు నిర్మించుకోలేక అదే ఇంట్లో ఉంటున్నారని గ్రామస్థులు తెలిపారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లక్ష్మి కుటుంబం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఇల్లు మంజూరై ఉంటే కుటుంబానికి సురక్షితమైన నివాసం లభించి ఉండేదని, ఈ విషాదాన్ని నివారించే అవకాశం ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. “ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉన్నా.. నిరుపేద కుటుంబానికి సురక్షితమైన ఇల్లు ఎందుకు అందలేదు?” అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన పేదల దరఖాస్తులను అధికారులు ఏ ప్రాతిపదికన పరిశీలిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

కుటుంబం కన్నీరుమున్నీరు

లక్ష్మి మృతితో ఆమె భర్త కమలాకర్‌, కుమారుడు పవన్‌, కుమార్తె రోహిణి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిరుపేద కుటుంబానికి సురక్షితమైన ఇల్లు అందక, చివరకు అదే శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడం బాధాకరమని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సురక్షిత నివాసం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కోనరావుపేట మండలంలోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను అధికారులు గుర్తించి, ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న కుటుంబాలను అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.