కష్టకాలంలో కాంగ్రెస్ అండగా ఉంటుంది
శాంతమ్మ కుటుంబానికి నేతల పరామర్శ
రాయపర్తి సర్పంచ్ గారె సహేంద్ర భిక్షపతి
కాకతీయ, రాయపర్తి : శాంతమ్మ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, కష్టకాలంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాయపర్తి సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండల కేంద్రానికి చెందిన పరకాల శాంతమ్మ సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ రమేష్, చెవ్వు కాశీనాధం, బొమ్మెర కళ్యాణ్ గౌడ్, ఉస్మాన్, కాంచనపల్లి వనజారాణి, కుంట రాజు, పీరని ప్రవీణ్, రఫీ, శేఖర్, నర్సింహుల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

