epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏటూరునాగారంలో అభివృద్ధిపై ప‌ట్టింపేది.?

ఏటూరునాగారంలో అభివృద్ధిపై ప‌ట్టింపేది.?
వెయ్యి రోజుల పాలనలో హామీలకు దిక్కేది?
ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై లెక్క చెప్పాలి
రైతుబంధు, రుణమాఫీపై చెప్పేదొకటి.. చేసేదొకటి
హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం
ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు

కాకతీయ, ఏటూరునాగారం : ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఆదేశాలు, కేటీఆర్‌ పిలుపు, హరీశ్‌రావు సూచనల మేరకు చేపడుతున్న వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఏటూరునాగారంలో మూడో రోజు బీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టింది. ఓడవాడ హనుమాన్‌ ఆంజనేయస్వామి ఆలయం నుంచి బస్టాండ్‌ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ బాబు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేసిందో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం, యువతకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు, విదేశీ విద్య, విదేశాలకు వెళ్లే వారికి రూ.25 లక్షల రుణం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు తాము ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. రైతుబంధు, రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటిగా ఉందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలను నమ్మించేందుకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం సరికాదన్నారు. రైతులు, మహిళలు, యువత, పేదలు, దివ్యాంగుల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం వాటిపై సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

ఏటూరునాగారం అభివృద్ధిపై ప్ర‌భుత్వం చేతులేత్తెసింది

ఏటూరునాగారం అభివృద్ధి విషయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసిందని లక్ష్మణ్‌బాబు అన్నారు. ఏటూరునాగారం బస్‌డిపో విషయంలో ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘మీరు కట్టారా?’’ అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత బస్‌డిపో ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు. గోదావరి కరకట్ట నిర్మాణం పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యల పరిష్కారం కోసం గోదావరి వెంట పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. కేసీఆర్‌ హయాంలో మంజూరైన ఏటూరునాగారం ఆర్డీఓ కార్యాలయం మూడేళ్లుగా ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. హెచ్‌ఏఎం రోడ్ల నిర్మాణ విధానంపై కూడా ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి రుణ ఆధారిత విధానాలను ఎందుకు అనుసరిస్తోందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. ఏటూరునాగారంలో మంజూరైన 170 ఇళ్లలో 150 నిర్మాణాలు ప్రారంభమైనప్పటికీ సుమారు 60 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.

కొండా సురేఖకు గౌరవం ఇవ్వ లేదు
మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని లక్ష్మణ్‌బాబు విమర్శించారు. కొండా సురేఖ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, రాజకీయ ప్రత్యర్థులమైనప్పటికీ అసత్య ఆరోపణలు చేయబోమని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖను మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లలో తగిన విధంగా భాగస్వామ్యం చేయలేదని ఆరోపించారు. జాతర సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సురేఖ ఫొటోకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంత్రి సీతక్కే మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చూపించారని విమర్శించారు. బీసీ మహిళగా ఉన్న కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. మేడారం జాతర నిధుల వినియోగానికి సంబంధించి సుమారు రూ.250 కోట్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ.. వాటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని లక్ష్మణ్‌బాబు డిమాండ్‌ చేశారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు, రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన ప్రభుత్వ పనులు, బిల్లుల విషయంలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘దొరల గడులు బద్దలు కొడతాం’ అంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు లక్ష్మణ్‌బాబు ఘాటుగా బదులిచ్చారు. ఏటూరునాగారంలో దొరల గడులు లేవని, ప్రజల కోసం ఎప్పుడూ తెరిచి ఉండే ‘జనతా గ్యారేజ్‌’ ఉందని అన్నారు. తరతరాలుగా ప్రజలకు అండగా నిలుస్తూ, వారి కష్టాల్లో పగలు–రాత్రి తేడా లేకుండా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని చెప్పారు. తమ గొంతు నొక్కాలని చూసినా వెనక్కి తగ్గబోమని, ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

ఫ్లెక్సీల తొల‌గింపుతో ఉద్రిక్త‌త..!

బస్టాండ్‌ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల తొలగింపుపై లక్ష్మణ్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. మంత్రి సీతక్క ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఏటూరునాగారం ఎస్‌ఐ మహేశ్‌, లక్ష్మణ్‌బాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మిగిలిన నాలుగు రోజుల కార్యక్రమాలను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని లక్ష్మణ్‌బాబు తెలిపారు. యువత కార్యక్రమంతోపాటు ములుగు, వెంకటాపురం ప్రాంతాల్లో భారీ ర్యాలీలు చేపడతామని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతులు, యువత, పేదలు, దివ్యాంగుల సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేపడతామని, హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజల తరఫున పోరాడతామని లక్ష్మణ్‌బాబు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.