epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థుల‌ను మోసగించిన కాంగ్రెస్

విద్యార్థుల‌ను మోసగించిన కాంగ్రెస్
జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌ హామీల విస్మ‌ర‌ణ‌
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుద‌ల చేయ‌కుండా గోస పెడుతున్న ప్ర‌భుత్వం
జీఓ 97ను వెంటనే రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌
వర్ధన్నపేట గడ్డపై కదం తొక్కిన విద్యార్థి లోకం.. భారీ ర్యాలీ

కాకతీయ, వర్ధన్నపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయినా యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన వారం రోజుల పోరుబాటలో భాగంగా 4వ రోజు భీమారం జంక్షన్‌ నుంచి ఎర్రగట్టుగుట్ట జంక్షన్‌ వరకు విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిఘటించాయని ఆయన అన్నారు. పోలీసులు భారీగా మోహరించడంతో భీమారం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

ఎన్నికల సమయంలో యూత్‌ డిక్లరేషన్‌ పేరుతో యువత, విద్యార్థుల భవిష్యత్తును మారుస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదని అరూరి రమేష్‌ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూత్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ర్యాలీకి స్వచ్ఛందంగా హాజరయ్యేందుకు సిద్ధమైన విద్యార్థులు రాకుండా కాంగ్రెస్‌ నాయకులు కళాశాలలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని, లేకపోతే విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసులకు భయపడవద్దని, పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అరూరి రమేష్‌ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.