ఏఐఏసీ జాతీయ కోఆర్డినేటర్‌గా శోభన్‌బాబు కొనసాగింపు
కాకతీయ, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం నర్సింగాపురం (అయ్యగారుపల్లి) గ్రామానికి చెందిన భూక్య శోభన్‌బాబుకు కాంగ్రెస్ పార్టీ మరో కీలక బాధ్యత అప్పగించింది. ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూప్ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా ఆదివారం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ (ఏఐఏసీ) జాతీయ కోఆర్డినేటర్‌గా, కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ కాంగ్రెస్ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ, వార్‌రూమ్ కార్యకలాపాలు, విద్యార్థి, యువజన కార్యక్రమాలు, ఆదివాసీ హక్కుల ఉద్యమాల్లో శోభన్‌బాబు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. కొత్త బాధ్యతల్లో డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఐటీ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలను సమన్వయం చేస్తానన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మెంటార్‌షిప్, నాయకత్వ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన కన్వీనర్ అడ్వకేట్ అర్చనా పొత్రే, ఏఐఏసీ చైర్మన్ డా. విక్రాంత్ భూరియా, కె. రాజు ఐఏఎస్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శోభన్‌బాబుకు మండల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

