గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం!
బీఆర్ఎస్ను వీడి హస్తం గూటికి భారీ సంఖ్యలో నాయకులు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో బీఆర్ఎస్కు చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం వారు హస్తం గూటికి చేరారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ మంత్రి పొంగులేటి ‘ఇందిరమ్మ ఇళ్ల శీనన్న’గా ప్రజల మన్ననలు పొందుతున్నారని దయాకర్‌రెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. గోళ్లపాడులో పెండింగ్‌లో ఉన్న రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు మంత్రి చొరవతో పూర్తయ్యాయని వివరించారు. పార్టీలో చేరిన వారిలో ఆటో యూనియన్ అధ్యక్షుడు గడ్డమీద ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ దొంతిసర్పు రాంబాబు, మాజీ వార్డు సభ్యుడు చీకటిమళ్ల లక్ష్మీనారాయణ, గౌడ సంఘం నాయకుడు మడికంటి శ్రీను, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రుద్ర మధు, ఎస్సీ నాయకుడు పొన్నెకంటి రాంబాబు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మద్ది వీరారెడ్డి, మద్ది కిషోర్‌రెడ్డి, రుద్ర ఉపేందర్, తేజావత్ పంతులు నాయక్, మద్ది వెంకటరెడ్డి, మందటి వెంకటరెడ్డి, శాబాదు మాధవరెడ్డి పాల్గొన్నారు.

