ప్రమాదాలకు తావివ్వొద్దు.
నిమజ్జన వేళ అప్రమత్తత అవసరం
వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య
కాకతీయ, రాయపర్తి: వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. చీకటి పడకముందే నిమజ్జనం పూర్తి చేయాలని, ఘాట్ల వద్ద భద్రత, లైటింగ్, రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. శోభాయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ వై. సంజీవరావు, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో పాక శ్రీనివాసులు, ఎంపీఓ కూచన ప్రకాష్, గిర్దావర్ చంద్రమోహన్, ఎస్సై ముత్యం రాజేందర్, పంచాయతీ కార్యదర్శి యాకూబ్ నాయక్, జీపీఓ సురేష్, కారోబార్ కారుపోతుల రామచంద్రయ్య, ముద్రబోయిన రాజు పాల్గొన్నారు.

