epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి
గిరిజన బాలికల హాస్టళ్లలో ఏం జరుగుతోంది..?
కరువవుతున్న భద్రత.. పర్యవేక్షణ గాలికి
స్టడీ అవర్స్‌లో కర్రతో కొట్టిన లీడర్ విద్యార్ది.. ముగ్గురికి అస్వస్థత
అర్ధరాత్రి విద్యార్థుల ఫోన్‌తో వెలుగులోకి ఘటన
వార్డెన్ తీరు పై తల్లిదండ్రుల ఆగ్రహం
వరుస ఘటనలతో హాస్టళ్ల నిర్వహణపై ప్రశ్నలు
పర్యవేక్షణ లోపాలతోనే ఘటనలు పునరావృతం
బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న తల్లిదండ్రులు
కాకతీయ, ఏటూరునాగారం: గిరిజన బాలికలకు రక్షణగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థినుల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆదివారం రాత్రి ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్‌లో ఘటన చోటుచేసుకుంది. స్టడీ అవర్స్‌లో చదవడం లేదంటూ 9వ తరగతికి చెందిన లీడర్‌ విద్యార్థిని ముగ్గురు విద్యార్థినులను కర్రతో కొట్టింది. దీంతో 6వ తరగతికి చెందిన ఒకరు, 7వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయానికి గురైన విద్యార్థినులు తీవ్రంగా ఏడవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ముగ్గురినీ ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
వార్డెన్ ముందే వెళ్లడంతో..
ఘటన జరిగిన సమయంలో హాస్టల్‌ వార్డెన్‌ లింగయ్య అందుబాటులో లేకపోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ తన విధులు ముగియడానికి సుమారు అరగంట ముందే హాస్టల్‌ నుంచి వెళ్లిపోయి, విద్యార్థినుల బాధ్యతలను నైట్‌ వాచ్‌మెన్‌కు అప్పగించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అదే సమయంలో హాస్టల్‌లో స్టడీ అవర్స్‌ కొనసాగుతున్నాయి. ముగ్గురు విద్యార్థినులను కర్రతో కొడుతున్న సమయంలో నైట్‌ వాచ్‌మెన్‌ అడ్డుకోలేదని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న సమయంలో వార్డెన్‌ అందుబాటులో లేకపోవడం, బాధ్యతలను వాచ్‌మెన్‌కు అప్పగించి వెళ్లడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి తల్లిదండ్రులకు విద్యార్థుల ఫోన్
ముగ్గురు విద్యార్థినులను కర్రతో కొట్టిన ఘటనపై హాస్టల్‌ నిర్వాహకుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి 1–2 గంటల సమయంలో తోటి విద్యార్థినులు వేరే వ్యక్తి ఫోన్‌ ద్వారా విషయం తెలియజేయడంతోనే ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని తమ పిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన లీడర్‌ విద్యార్థిని తన మణికట్టును చాకుతో కోసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తమ పిల్లలపై జరిగిన ఘటన గురించి సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం, హాస్టల్‌ నిర్వహణ, వార్డెన్‌ తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుస ఘటనలతో హాస్టళ్లపై ప్రశ్నలు
ఇదిలా ఉండగా.. ఈ నెల 7న ఏటూరునాగారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల సమస్యలపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమస్యలను ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్‌ కిరణ్మయిని మహబూబాబాద్ గురుకుల కళాశాలకు, మ్యాథ్స్‌ లెక్చరర్‌ తిరుపతమ్మను ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు గురుకుల కళాశాలకు బదిలీ చేయగా, కామర్స్‌ లెక్చరర్‌ అనితకు ప్రిన్సిపల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్‌లో ముగ్గురు విద్యార్థినులను లీడర్‌ విద్యార్థిని కర్రతో కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు ఘటనలు వేర్వేరు హాస్టళ్లలో జరిగినప్పటికీ, వరుసగా సమస్యలు వెలుగులోకి రావడం హాస్టళ్లలో పర్యవేక్షణ తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం, బాధ్యతలను ఇతర సిబ్బందికి అప్పగించడం వంటి పరిస్థితులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. పర్యవేక్షణ కరువుతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలికల హాస్టళ్లలో నిరంతర పర్యవేక్షణతో పాటు విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాలకు తావివ్వొద్దు.

ప్రమాదాలకు తావివ్వొద్దు. నిమజ్జన వేళ అప్రమత్తత అవసరం  వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య  కాకతీయ, రాయపర్తి:...

ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి రాష్ట్ర...

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌  కాకతీయ, నెల్లికుదురు:...

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం హక్కుల సాధ‌న‌కు...

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు రూ. 4.20 లక్షల వరకు అక్రమ...

కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర...

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌! సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం 2009లో...

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.