epaper
Tuesday, September 22, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి
విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం
హక్కుల సాధ‌న‌కు గ‌ళం విప్పాలి.. చేత‌నైనా పోరాటం చేయాలి
రాజ‌కీయాల‌ను అస‌హ్యించుకుంటే ఏం ప్ర‌యోజ‌నం.. ఇక మార్పు ఎలా సాధ్యం..?!
బీసీ ఉద్య‌మం అంటే ఓసీల‌ను వ్యతిరేకించ‌డం కాదు.. మ‌న హ‌క్కులే ల‌క్ష్యం కావాలి
క‌నిపించ‌ని కుల వివక్షే నాలో కసిని పెంచింది..ఈ స్థాయికి చేర్చిది
వైద్యుడిగా పేదలకు న్యాయం చేయాలన్నదే నా సిద్ధాంతం
ఈటలే నా రాజకీయ గురువు.. ఆయన వెంటే నా న‌డ‌క‌
పరకాల ప్రజలతోనే నా రాజకీయ ప్రయాణం
డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌లో  బీజేపీ ప‌ర‌కాల కాంటెస్టెడ్ అభ్య‌ర్థి, ప్ర‌ముఖ వైద్యుడు ప‌గ‌డాల కాళీ ప్ర‌సాద్‌రావు
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నతంగా ఎదగాలంటే విద్య తప్ప మరో మార్గం లేదు. బీసీలకు జ్ఞానోదయం రావాలి. బీసీలు ఉద్యమించాలి. హక్కుల కోసం పోరాడాలి. అదే సమయంలో అగ్రవర్ణాలను కూడా దూరం చేయకుండా మన ఉద్యమాన్ని వారికి వివరించి, వారిని కలుపుకొని ముందుకు సాగాలి. అప్పుడే బీసీల‌కు న్యాయం ద‌క్కుతుంది.. ఉద్య‌మాల‌కు స‌రైన మ‌ద్దతు ల‌భిస్తుంద‌ని.. సక్సెస్ అవుతుంది’ అని బీజేపీ రాష్ట్ర నాయ‌కుడు, ప‌ర‌కాల అసెంబ్లీ సీటు కాంటెస్టెడ్ బీజేపీ అభ్య‌ర్థి, ప్ర‌ముఖ వైద్యులు ప‌గ‌డాల కాళీ ప్ర‌సాద‌రావు అన్నారు. డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన బాల్యం, కుటుంబం, చదువు, వైద్య ప్రస్థానం, సామాజిక అనుభవాలు, రాజకీయ రంగ ప్రవేశం, పరకాలతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఆయ‌న వెల్ల‌డించిన అనేకానేక అంశాలు ఆయ‌న మాట‌ల్లోనే…!
ఆటలకు వెళ్లకుండా పుస్తకంతో కూర్చునేవాడిని
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక నా స్వగ్రామం. మా నాన్న పగడాల వెంకటనర్సయ్య, అమ్మ వజ్రమ్మ. నాకు తమ్ముడు, చెల్లి ఉన్నారు. మా నాన్న టీచర్‌. ఆయన బదిలీ అయిన ప్రతిచోటికీ మా కుటుంబం వెళ్లాల్సి వచ్చేది. టెన్త్‌ వరకు గ్రామాల్లోనే చదువుకున్నా. పదో తరగతి చిట్యాలలో చదివా. ఇంటర్‌ పరకాలలో పూర్తి చేశా. మా నాన్నకు నన్ను డాక్టర్‌ చేయాలనే కోరిక ఉండేది. అందుకే నన్ను నిర్బంధంగా చదివించేవాడు. నా తోటి పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్తే నేను మాత్రం బుక్‌ ముందేసుకుని కూసునేటోడిని. మా నాన్న ఎప్పుడైనా ఊరికి పోతే సంబురపడేది. అప్పుడు మా అమ్మను బతిమిలాడుకుని ఆటకు పోయేవాడిని’’ అని తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. మా ఊరిలోని దొర కుటుంబాలను చూడటం కూడా నాకు చదువుపై ఆసక్తి పెరగడానికి ఒక కారణం. రిటైర్డ్‌ జడ్జి రఘునందన్‌రావు మా ఊరికి వచ్చినప్పుడు ఆయన్ను, ఆయన పిల్లలను చూసేందుకు ఊరంతా వెళ్లేది. వాళ్ల డ్రెస్సింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడే తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచేది. నేను కూడా మంచిగా చదువుకుంటే ఈ స్థాయికి ఎదగవచ్చని అప్పుడే అనుకున్నా. అప్పటి నుంచి చదువుపై ఇంట్రెస్ట్‌ పెంచుకున్నా. మా తాత బుచ్చిరామయ్య ఓ ట‌ర్మ్ రేపాక గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాడు. తాతకు నేనంటే చాలా ఇష్టం. మనవళ్లందరిలో నన్ను ప్రత్యేకంగా చూసుకునేవాడు. ఆయ‌న గుర్తుగా ఉండేందుకు నా కూతురి కొడుక్కి ఆయ‌న పేరే పెట్టుకున్నా. ఎంసెట్‌ రెండుసార్లు రాశా. కానీ నిరాశే ఎదురైంది. మూడో ప్రయత్నంలో సీటు సాధించా. కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, పీజీ పూర్తి చేశా. మొదట 2 సంవత్సరాలు ఏటూరునాగారంలో పనిచేశా. తర్వాత 12 సంవత్సరాలు ఎంజీఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశా. 1992లో నాకు పెళ్లయింది. నా భార్య స్వర్ణలత ఎంబీబీఎస్‌, డీజీఓ. నా క్యారెక్టర్‌, మా నాన్న టీచర్‌ అని మా మామ ఆకుల ఆనందం వెతికి మరీ పట్టుకుని పెళ్లి చేసిండు(నవ్వుతూ).
ఎంబీబీఎస్‌లోనే కులం గురించి తెలిసింది
ఇంటర్‌ వరకు నాకు కులం అంటే పెద్దగా తెలియదు. ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాతే కులం గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఉన్నత విద్యలో కుల వివక్ష ఉంటుందని అప్పుడే తెలిసింది. నేను ఎంబీబీఎస్‌లో కుల వివక్షతో ఎంతో బాధపడ్డా. కొంతమందికి నమస్తే పెడితే వాళ్లు స్పందించేవారు కాదు. ఎందుకు పట్టించుకోవడం లేదని ఆలోచించేవాడిని. నా డ్రెసింగ్‌ వల్లనా అనుకునేవాడిని. కుల వివక్ష గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఏడాదిపైనే పట్టింది. అగ్రవర్ణాల విద్యార్థులు గ్రూపులుగా ఉంటారని తర్వాత తెలిసింది. వాళ్లకు వాళ్లకు నమస్తేలు పెట్టుకోవడం, సహకరించుకోవడం, పార్టీలు చేసుకోవడం ఉండేది. ఎంబీబీఎస్‌లో నాకు ఎదురైన వివక్ష, బీసీలపై కనిపించిన నిర్లక్ష్యమే నాలో మరింత కసిని పెంచింది. ఆ కసితోనే చదువులో ముందుకు వెళ్లా. అదే కసి నన్ను జీవితంలో, వైద్య వృత్తిలో రాణించేలా చేసింది. ఈ ప్రయాణంలో నా మిత్రుడు రాజబోయిన యాకయ్య చాలా కీలకంగా నిలిచాడు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన యాకయ్య నాకు మిత్రుడు మాత్రమే కాదు.. నా ఆత్మ. నేను, యాకయ్య కలిసి కష్టపడ్డాం. అన్నిట్లో నాకు ఆయన అండగా ఉండేవాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు మెడికల్‌ కాలేజీ చైర్మన్లుగా ఉన్న కాలేజీ మా ఆర్వీఎం ఒక్క‌టే. యాకయ్య నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నేడు నాడి ప‌ట్టే డాక్టర్‌ కరువయ్యాడు
ప్రస్తుత వైద్యం ఆందోళనకరంగా మారింది. డాక్టర్లు పేషెంట్లకు దూరమయ్యారు. మిషన్లు, డబ్బులు దగ్గరయ్యాయి. నాడి పట్టుకునే డాక్టర్‌ లేకుండా పోయాడు. అందరిలో మార్పు వచ్చింది. టెస్టులు చేయకపోతే రోగులు అయ్యో అనే ఆందోళన చెందుతున్నారు. గతంలో నాడి పట్టుకుని, రోగి వివరాలు అడిగి సమస్య తెలుసుకుని వ్యాధిపై అంచనాకు వచ్చి చికిత్స చేసేవారు. ఇప్పుడు చికిత్స ఖర్చు పెరిగింది. భవిష్యత్‌లో డాక్టర్ల వ్యవస్థ మరింత పతన స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది చేదు నిజం.  ‘2008లో గార్డియన్‌ ఆస్పత్రికి స్టోన్‌ పడింది. ములుగు రోడ్డులో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించినప్పుడు చాలామంది నన్ను చూసి నవ్వుకున్నారు. ‘ఇక్కడ ఏం డెవలప్‌మెంట్‌ ఉంటుంది’ అని నిరుత్సాహపరిచారు. కానీ నాకు ఉన్న విజన్‌తో ఆస్పత్రి కట్టా. నేడు సక్సెస్‌ అయ్యా. 2010లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి గార్డియన్‌ ఆస్పత్రి ప్రారంభించా. నేను ప్రారంభించినప్పుడు ఈ ఆస్పత్రి చాలా పెద్దది. ఇప్పుడు మిడిల్‌కు వచ్చింది. పేషెంట్లకు 24/7 అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆస్పత్రి పై ఫ్లోర్‌లోనే ఇల్లు ఏర్పాటు చేసుకున్నా. ఉద్యోగ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు పేషెంట్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి సమస్య తెలుసుకుంటా.
వైద్యంతో గౌరవం.. ఐఎంఏలో మరో అడుగు
ఈ వృత్తితో నాకు ఎంతో గౌరవం వచ్చింది. 1997లో ఐఎంఏ మెంబర్‌షిప్‌ తీసుకున్నా. ఐఎంఏ ఏ సమావేశం పెట్టినా హాజరయ్యేవాడిని. 2023లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశా. ఐఎంఏలో కీలకంగా ఉంటా. ఐఎంఏలో బీసీలు అధ్యక్షుడు కావాలంటే కష్టం ఉండేది. అలాంటిది సుగమం చేశా. నా ఇద్దరు బిడ్డలూ డాక్టర్లే. పెద్ద కూతురు తేజస్వీ ఎంఎస్‌ ఆప్తల్మాలజీ, అల్లుడు అనురాగ్‌ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌. చిన్న కూతురు యశస్వి ఎండీ జనరల్‌ పూర్తి చేసింది. రానున్న కొద్ది రోజుల్లోనే హాస్పిటల్‌ను మరింత డెవలప్‌ చేసి వాళ్లకు అప్పగిస్తా.
రేపాక నుంచి పరకాలకు సైకిల్‌పై
ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. 1983లో ఎన్టీఆర్‌ వస్తున్నాడని తెలిసి ఫ్రెండ్స్‌తో కలిసి రేపాక నుంచి సైకిళ్లపై పరకాలకు వచ్చినం. ఒక్కో సైకిల్‌పై ముగ్గురం వచ్చాం. టీడీపీ అంటే అభిమానం ఉండేది. యువరక్తం కదా.. ఆ పార్టీ నాయకులతో తిరిగేది. అయితే మా తాత కాంగ్రెస్‌ అభిమాని. నేను వాళ్లతో తిరుగుతుంటే తాత తిట్టేవాడు. ‘మీ నాన్నకు ఉద్యోగం పెట్టించింది కాంగ్రెస్‌రా’ అని చెప్పేవాడు. 2004 నుంచి 2014 వరకు మున్నూరుకాపు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. కులం మద్దతు నాకు పుష్కలంగా ఉంది.
ఈటలే నా రాజకీయ గురువు
రాజబోయిన యాకయ్య ద్వారానే ఈటల రాజేందర్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఈటల సహకారంతో మెడికల్‌ కాలేజీ ప్రారంభించా. కాలేజీ ప్రారంభోత్సవానికి కేసీఆర్‌ కూడా వచ్చారు. నా రాజకీయ గురువు ఈటల. ఎప్పటికైనా ఆయన వెంటే నా నడక ఉంటుంది. నాకు పరకాల టికెట్‌ రావడం వెనక ఆయనే ఉన్నారు. నేను ఆయన్ను టికెట్‌ కోసం ఫోర్స్‌ చేయలేదు. కానీ నా బాధ్య‌త మాత్రం ఆయ‌నే తీసుకున్నారు. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే..కాళీ ప్ర‌సాద్ కూడా పోటీ చేస్తారని ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఆ మాటతో అందరూ అవాక్కయ్యారు. ఈటల రాజేందర్‌ ప్రోత్సాహంతోనే పరకాల నియోజకవర్గంలో పనిచేస్తున్నా. పరకాల నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా. ఎన్నికల్లో చాలామంది ఓటర్లు నాపై నమ్మకంతో ఓటేశారు. ఎన్నికల్లో ఓడిపోయానని బాధపడలేదు. అయితే బీసీలు అంతమంది ఉన్నా.. బీసీ బిడ్డను నన్ను కాదని అగ్రవర్ణాలను ఆదరించడం బాధగా అనిపించింది. అయినా నేను నియోజకవర్గంతోనే ఉన్నా. రిజల్ట్‌ మరుసటి రోజు నుంచే పరకాల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. ప్రజలకు కూడా అర్థమైంది. నాకు వస్తున్న ఆదరణ, ప్రజల మాటలు వింటుంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం పెరిగింది.
‘నా బుర్రలో పాలిటిక్స్‌.. పాలిటిక్స్‌’
చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది. అందుకేనేమో నా బుర్రలో పాలిటిక్స్‌.. పాలిటిక్స్‌ అని తిరుగుతూ ఉండేది. 2004లో 50 మంది డాక్టర్లతో కలిసి వినోద్‌కుమార్‌ సాయంతో కేసీఆర్‌ను కలిసి హన్మకొండ టికెట్‌ అడిగాం. కానీ పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో అవకాశం మిస్‌ అయింది. 2005 కార్పొరేషన్‌ హయాంలో మేయర్‌ చాన్స్‌ కోసం కూడా ఆఫర్‌ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి కూడా ఆఫర్‌ వచ్చింది. పరకాలలో బీసీగా నన్ను బరిలో దింపాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ నా ప్రయాణం ఈటలతోనే అని చెప్పా. పాలిటిక్స్‌ను కూడా ఒక కోర్సులా చదువుతున్నా. కసితో ముందుకు పోతున్నా. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటున్నా. మిగతా వాళ్లు వదిలేశారు. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ మేరకు నా ఆస్పత్రికి వచ్చే వారికి బిల్లులు కూడా తగ్గిస్తున్నా. నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదు. డబ్బే కావాలంటే నాకు వైద్య రంగంలోనే సంపాదించుకోగలను. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు వచ్చింది.  ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు పెట్టాలి.. సంపాదించుకోవాలనే ధోరణి ఉంది. అవి పోవాలి. రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్లు రావాలి. డీలిమిటేషన్‌పై వస్తున్న ప్రచారం అంతా ఊహాజనితమే. మోదీకి, అమిత్‌షాకు తప్ప డీలిమిటేషన్‌ అంశం ఎవరికీ తెలియదు. అధికారిక నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై వస్తున్న ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఉత్త‌రం కాక‌తీయ‌, ఎడిట‌ర్‌
కిర‌ణ్ గౌడ్ అరెల్లి
-7396604266

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన కాకతీయ,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి లోని బాలికల గురుకుల...

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం బడి తండా సర్పంచి ధనమ్మ అమ్రూ నాయక్ కాకతీయ,నెల్లికుదురు...

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు 27 నుంచి స్వామివారి మండల దీక్షలు...

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం కాకతీయ,...

ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన

ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన రెండు రోజుల్లో రెండు చోట్ల పైకప్పు...

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ కాకతీయ, పెద్దవంగర : కష్టాల్లో...

ఎంజీఎంలో ఉద్రిక్తత

ఎంజీఎంలో ఉద్రిక్తత ఆస్ప‌త్రిలోకి వెళ్ల‌కుండా మాజీ ఎమ్మెల్యే దాస్యంను అడ్డుకున్న‌పోలీసులు భ‌వ‌నాలకు పెచ్చులూడ‌టాన్ని ప‌రిశీలించేందుకు...

వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం

వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం విద్యార్థుల నుంచి రూ.10 వేల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.