కార్తీక్ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన మద్దెల కార్తీక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ శ్రీరామగిరికి చేరుకుని కార్తీక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ కార్తీక్ అకాల మృతి కలచివేసిందన్నారు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచి మాదరి ప్రశాంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ రామగిరి సుమన్, నాయకులు ప్రభాకర్‌గౌడ్, బాలాజీనాయక్, బెల్లి నర్సయ్య, డోనికెన మల్లయ్య, కుటుంబ సభ్యులు సుచరిత, మద్దెల భద్రయ్య, డా.ప్రభాకర్, మద్దెల పవన్ తదితరులు పాల్గొన్నారు.

