జర్నలిస్ట్ కుటుంబానికి అండగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ
కాకతీయ, పెద్దవంగర : కష్టాల్లో ఉన్న జర్నలిస్ట్ కుటుంబానికి తామున్నామంటూ బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన జర్నలిస్ట్ చింతల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని తెలుసుకున్న సొసైటీ సభ్యులు మంగళవారం ఐలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి 46వెల రూపాయలు ఆర్థిక సహాయం అందించి అతని ముగ్గురు పిల్లలకు ఉచితంగా చదివిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ప్రసన్న కుమార్,ఉపాధ్యక్షులు మమతా రాణి,సభ్యులు వేణు, రాజు,యకమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కుటుంబానికి అండగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

