epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తహసీల్దార్‌ సంతకం, ముద్ర ఫోర్జరీ

తహసీల్దార్‌ సంతకం, ముద్ర ఫోర్జరీ
నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌తో భూముల మ్యుటేషన్‌కు యత్నం!
కరీమాబాద్‌ మహిళపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు
ద‌ర్యాప్తు చేప‌ట్టిన ఏజే మిల్స్‌ కాలనీ పోలీసులు

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : భూముల మ్యుటేషన్‌ కోసం నకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ సృష్టించిన వ్యవహారం వరంగల్‌లో వెలుగుచూసింది. ధ్రువపత్రంపై ఖిలా వరంగల్ తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రను ఉపయోగించినట్లు తహసీల్దార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కరీమాబాద్‌కు చెందిన మెహరున్నీసా బేగంపై ఏజే మిల్స్‌ కాలనీ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 780/2026తో అక్టోబర్‌ 17, 2026న రాత్రి 10 గంటలకు కేసు నమోదైంది. ఖిలా వరంగల్‌ తహశీల్దార్‌ ఎం.డి. ఇక్బాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 336(3), 340(2), 337 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివరాత్రి మహేష్‌ దర్యాప్తు చేస్తున్నారు. కరీమాబాద్‌కు చెందిన మెహరున్నీసా బేగం తన భర్త దివంగత మహమ్మద్‌ అబ్దుల్‌ రహీం పేరుతో ఉన్నట్లు పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను ఆత్మకూరు తహసీల్దార్‌కు సమర్పించారు. సర్టిఫికెట్‌ నంబర్‌ సి/3223/2026, తేదీ 08-01-2026గా ఉంది. దీని ప్రామాణికతపై అనుమానం రావడంతో ఆత్మకూరు తహసీల్దార్‌ ఖిలా వరంగల్‌ తహశీల్దార్‌ కార్యాలయాన్ని వివరణ కోరారు.

జారీ చేయని ధ్రువపత్రం.. ఫోర్జరీ సంతకం?

ఖిలా వరంగల్ తహసీల్దార్‌ కార్యాలయంలోని రికార్డులు, పంపిణీ రిజిస్టర్‌ను పరిశీలించగా, 2026లో ఆ నంబరుతో ఎలాంటి ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ జారీ కాలేదని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సదరు ధ్రువపత్రం నకిలీదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్‌ సంతకం, కార్యాలయ ముద్రను కూడా నకిలీగా ఉపయోగించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఇతర వారసుల పేర్లను చేర్చకుండా నకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ సృష్టించి, ప్రధానమైన వ్యవసాయ భూములను తమ పేర్లపైకి మ్యుటేషన్‌ చేయించుకునేందుకు ప్రయత్నించినట్లు తహసీల్దార్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో జైనాబీ, మహమ్మద్‌ అబ్దుల్‌ రహీం, మెహరున్నీసా బేగం, మహమ్మద్‌ పర్వేజ్‌ పేర్లను ప్రస్తావించారు.

లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తహశీల్దార్‌ ఎం.డి. ఇక్బాల్‌ ఆర్‌సీ నంబర్‌ సి/2912/2026తో అక్టోబర్‌ 17న ఏజే మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు లేఖ రాశారు. మెహరున్నీసా బేగం (ఇంటి నంబర్‌ 16-1-881, కరీమాబాద్‌)పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ధ్రువపత్రం తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా? ఇలాంటి నకిలీ పత్రాలు మరిన్ని సృష్టించారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.