వరంగల్ సిటీ ప్లానర్‌గా రవీంద్ర డి. రాడేకర్
జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతితో పోస్టింగ్
గతంలో ఇన్చార్జి సిటీ ప్లానర్‌గా సేవలు
బల్దియాలో తీరనున్న ప్లానర్ కొరత
కాకతీయ, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన సిటీ ప్లానర్‌గా రవీంద్ర డి. రాడేకర్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి, వరంగల్ బల్దియాలో సిటీ ప్లానర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. రవీంద్ర డి. రాడేకర్ గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్చార్జి సిటీ ప్లానర్‌గా విధులు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో ఆయనకు గతంలో పనిచేసిన అనుభవం ఉంది. పదోన్నతి అనంతరం తిరిగి వరంగల్‌లోనే నియమించడంతో నగర ప్రణాళిక విభాగానికి పూర్తిస్థాయి అధికారి అందుబాటులోకి వచ్చినట్లయింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, భవన నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై పెండింగ్ పనుల పరిష్కారంపై దృష్టి సారించాల్సి ఉంది. సిటీ ప్లానర్ నియామకంతో బల్దియాలో చాలాకాలంగా ఉన్న ప్లానర్ కొరత తీరనుంది.

